శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Crime - Jul 13, 2020 , 14:37:56

మ‌హిళ‌కు లైంగిక వేధింపులు.. నిందితుడి అరెస్ట్‌

మ‌హిళ‌కు లైంగిక వేధింపులు.. నిందితుడి అరెస్ట్‌

ల‌క్నో: య‌థ ఉన్నోడు య‌థ చెప్పుకుంటుంటే.. ఏ రందీ లేనోడు వేలుకు లారీ క‌ట్టి లాగి చూసిన‌ట్టు ఉంది కొంద‌రి వ్య‌వ‌హార శైలి. ఒక‌వైపు క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్ర‌పంచ‌మంతా అల్ల‌క‌ల్లోలం అవుతుంటే.. మ‌రోవైపు కామాంధులు మ‌హిళ‌లను లైంగికంగా వేధిస్తూ మృగాళ్లా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. తాజాగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ష‌మ్లీ జిల్లాలో ఇలాంటి ఘ‌ట‌నే చోటుచేసుకుంది. 30 ఏండ్ల మ‌హిళ‌ను ఓ వ్య‌క్తి లైంగికంగా వేధింపుల‌కు గురిచేశాడు.

తానాభ‌వ‌న్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని చండెన‌మ‌ల్ గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితుడు అంకుర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మ‌హిళను వైద్య ప‌రీక్ష‌ల కోసం పంపించారు. వైద్య‌ప‌రీక్ష‌ల్లో వ‌చ్చే రిపోర్టును అనుస‌రించి నిందితునిపై త‌దుప‌రి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు చెప్పారు.      

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo