సోమవారం 25 జనవరి 2021
Crime - Jan 05, 2021 , 11:32:19

మూడేళ్ల చిన్నారి‌పై అత్యాచారం.. నిందితుడు అరెస్ట్‌

మూడేళ్ల చిన్నారి‌పై అత్యాచారం.. నిందితుడు అరెస్ట్‌

ముంబై : అభం శుభం తెలియ‌ని మూడేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు చెల‌రేగిపోయాడు. ఈ ఘ‌ట‌న శ‌నివారం రాత్రి చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. మ‌హారాష్ర్ట పాల్ఘ‌ర్ జిల్లాలోని త‌ల‌సారి తాలుకాలోని ఓ గ్రామానికి చెందిన చిన్నారి త‌న త‌ల్లితో క‌లిసి నిద్రిస్తోంది. ఈ క్ర‌మంలో పీక‌ల దాకా మ‌ద్యం సేవించిన 38 ఏళ్ల వ్య‌క్తి.. ఆ చిన్నారిని అప‌హ‌రించి పొలాల్లోకి తీసుకెళ్లాడు. అక్క‌డ ఆ పాప‌పై అత్యాచారం చేసి వ‌దిలేసి వెళ్లిపోయాడు. తెల్లారిన త‌ర్వాత చిన్నారిని గుర్తించిన స్థానికులు త‌ల్లిదండ్రుల‌కు స‌మాచారం అందించారు. 

హుటాహుటిన అక్క‌డికి చేరుకున్న త‌ల్లిదండ్రులు చికిత్స నిమిత్తం పాప‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అనంత‌రం పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. డాగ్ స్క్వాడ్ స‌హాయంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుడిని ప‌ట్టుకునేందుకు కూడా అత‌ని చెప్పులు ఉప‌యోగ‌ప‌డ్డాయ‌ని పోలీసులు తెలిపారు. పాప‌పై అత్యాచారం చేసిన చోటే చెప్పులు వ‌దిలి వెళ్లిన‌ట్లు పోలీసులు పేర్కొన్నారు.   


logo