హైదరాబాద్ : మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తిని నగరంలోని కేపీహెచ్బీ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుడిని టి.రవి కుమార్(30)గా గుర్తించారు. స్థానికంగా ఓ బ్యాంకులో పనిచేస్తున్నట్లు సమాచారం. వారం క్రితం మహిళ రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తుండగా బైక్పై వెళ్తూ రవికుమార్ ఆమెను అసభ్యకరంగా తాకి అక్కడినుండి జారుకున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించి ఐపీసీ 354 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.