గురువారం 29 అక్టోబర్ 2020
Crime - Sep 21, 2020 , 10:20:18

బాలికను బంధించి అశ్లీల చిత్రాలు తీసిన వ్యక్తి అరెస్టు

బాలికను బంధించి అశ్లీల చిత్రాలు తీసిన వ్యక్తి అరెస్టు

అజామ్‌ఘర్‌ :  ఉత్తర ప్రదేశ్‌లోని అజామ్‌ఘర్‌ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. పాయింట్‌ బ్లాక్‌లో గన్‌పెట్టి బాలికను అపహరించిన వ్యక్తి ఆమెతో అశ్లీల చిత్రాలు తీశాడు. అజామ్‌ఘర్‌కు చెందిన సలీమ్ అదే ప్రాంతానికి చెందిన ఓ బాలికను ఇటీవల చంపుతానని బెదించి అపహరించాడు. ఆమెను ఓ చోట బంధించి అశ్లీల చిత్రాలు తీశాడు. ఆదివారం బాధితురాలు అతడి బారి నుంచి తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం పంపామని కేసు దర్యాప్తు జరుగుతోందని అజామ్‌ఘర్‌ డీఎస్పీ రాజేశ్‌ తివారీ పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo