శనివారం 08 ఆగస్టు 2020
Crime - Aug 02, 2020 , 13:36:33

ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య‌

ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య‌

హైద‌రాబాద్ : ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో ఓ వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘ‌ట‌న న‌గ‌రంలోని ఎస్‌.ఆర్‌.న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో గ‌డిచిన రాత్రి చోటుచేసుకుంది. క‌ర్నూల్‌కు చెందిన ఎస్‌.మ‌హేశ్‌(30) అనే యువ‌కుడు త‌న ఉంటున్న ఇంట్లో తాడుతో ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు మృతుడి త‌ల్లిదండ్రుల‌కు స‌మాచారం అందించారు. మ‌హేశ్ ఆర్థిక ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్న‌ట్లు ఆత్మ‌హ‌త్య‌కు ఇదే కార‌ణ‌మై ఉండొచ్చ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఐపీసీ సెక్ష‌న్ 174 కింద కేసు న‌మోదు చేసుకుని పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు.


logo