మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Crime - Jul 24, 2020 , 10:59:20

భార్యాపిల్లల గొంతు కోసి.. వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య

భార్యాపిల్లల గొంతు కోసి.. వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య

బికానెర్‌ : రాజస్థాన్‌ రాష్ర్టం బికానెర్ జిల్లాలో ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లల గొంతుకోసి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. బికానెర్‌ జిల్లా సురజ్దా గ్రామానికి చెందిన జేతారామ్ మేఘవాల్ (౩8) స్థానికంగా ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగించేవాడు. మేఘవాల్‌ ఎప్పుడూ మానసికంగా నిరాశకు గురవుతూ భార్యతో గొడవ పడుతూ ఉండేవాడు. ఇదే సమయంలో బుధవారం రాత్రి కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో భార్య శారద (30), కుమారుడు జితేంద్ర(9), కుమార్తె (4)ను కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం తాను కూడా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గజ్నర్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) అమర్ సింగ్ తెలిపారు. ఈ సంఘటన బుధవారం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించి అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు పేర్కొన్నారు. logo