శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Aug 24, 2020 , 18:01:23

బస్టాండ్‌లో గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య

బస్టాండ్‌లో గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య

ముంబై : దక్షిణ ముంబై నాగ్‌పాడా ప్రాంతంలోని బెల్లాసిస్ రోడ్డు బస్టాండ్‌లో సోమవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి ఉరేసుకున్నాడు. స్థానికులు ఫోన్‌ చేసి విషయాన్ని పోలీసులకు చెప్పడంతో ఘటనా స్థలానికి చేరుకొని అతడిని సమీప జేజే ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి 45 ఏండ్లు ఉంటాయని, బిచ్చగాడిగా అనుమానిస్తున్నామని నాగ్‌పాడా పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ జయప్రకాశ్‌ భోస్లే తెలిపారు. అతడి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లభ్యం కాలేదని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మృతుడిపై ప్రివెన్షన్ ఆఫ్ బిగ్గింగ్ యాక్ట్ కింద కేసు నమోదైనట్లు ఆ ప్రాంతానికి చెందిన కొంతమంది బిచ్చగాళ్లు విచారణలో పోలీసులకు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo