శుక్రవారం 15 జనవరి 2021
Crime - Dec 20, 2020 , 19:10:24

ఐదు రోజులు, రెండు పెండ్లిళ్లు.. ప‌రారీలో పెండ్లి కొడుకు

ఐదు రోజులు, రెండు పెండ్లిళ్లు.. ప‌రారీలో పెండ్లి కొడుకు

న్యూఢిల్లీ: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఓ దొంగ పెండ్లి కొడుకు ఇద్ద‌రు అమ్మాయిల‌ను మోసం చేశాడు. చ‌దివింది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయినా క‌ట్నం కోసం ఇద్ద‌రిని మోగిసంచి పారిపోయాడు. ఐదు రోజుల వ్య‌వ‌ధిలో ఇద్ద‌రు యువ‌తుల‌ను పెండ్లి చేసుకుని ప‌లాయ‌నం చిత్త‌గించాడు. మొద‌టి పెండ్లి కూతురు బంధువు ఒకాయ‌న‌ త‌న‌కు సోష‌ల్ మీడియాలో క‌నిపించిన వ‌రుడి రెండో పెండ్లి ఫొటోల‌ను పంప‌డంతో మోసం బ‌య‌టప‌డింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. 26 ఏండ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఈ నెల 2న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని కంద్వా జిల్లాలో ఒక యువ‌తిని పెండ్లి చేసుకున్నాడు. అనంత‌రం ప‌నిమీద వెళ్తున్నాన‌ని చెప్పి డిసెంబ‌ర్ 7న ఇండోర్‌లో మ‌రో యువ‌తిని పెండ్లి చేసుకున్నాడు. బంధువు ద్వారా రెండో పెండ్లి సంగ‌తి తెలుసుకున్న మొద‌టి పెండ్లి కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేప‌ట్టారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.