శనివారం 08 ఆగస్టు 2020
Crime - Aug 02, 2020 , 13:10:54

ఆ వీడియోల‌ను తండ్రికి పంపి.. బ్లాక్‌మెయిల్ చేస్తున్న మేన‌మామ‌

ఆ వీడియోల‌ను తండ్రికి పంపి.. బ్లాక్‌మెయిల్ చేస్తున్న మేన‌మామ‌

సూర‌త్ : ఓ యువ‌తిని త‌న మేన‌మామ ప్రేమించాడు. ఇద్ద‌రు మరింత ద‌గ్గ‌య్యారు. కానీ ఆ అమ్మాయికి త‌ల్లిదండ్రులు వేరే సంబంధం చూస్తున్నారు. పెళ్లి చేసుకున్నాక కూడా.. త‌న వ‌ద్ద‌కు రావాల‌ని.. శారీర‌కంగా త‌న‌కు సుఖాన్ని ఇవ్వాల‌ని మేన‌మామ వేధించాడు. నో అని చెప్పినందుకు ఆమెపై ప‌గ పెంచుకుని.. ఏకాంతంగా గ‌డిపిన వీడియోల‌ను యువ‌తి తండ్రికి పంపాడు. ఈ ఘ‌ట‌న సూర‌త్‌లోని పునా ఏరియాలో వెలుగు చూసింది. 

25 ఏళ్ల యువ‌తి త‌న మేన‌మామ‌(30) వ‌ద్ద చీర‌ల‌కు పాల్స్ కుట్టడం, లేస్ వ‌ర్క్ నేర్చుకుంది. ఈ క్ర‌మంలో మేన‌మాన త‌రుచుగా యువ‌తి ఇంటికి వ‌చ్చి వెళ్లేవాడు. వీరిద్ద‌రి మ‌ధ్య సంబంధం ఏర్ప‌డింది. ప్రేమ పేరుతో ఆమెకు శారీర‌కంగా ద‌గ్గ‌ర‌య్యాడు. ఏకాంత స‌మ‌యంలో ఆమెకు తెలియ‌కుండా వీడియోలు చిత్రీక‌రించాడు. 

గ‌త మూడు నెల‌ల నుంచి ఆ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. దీంతో ఆమెకు మేన‌మామ నుంచి వేధింపులు ఎక్కువ అయ్యాయి. పెళ్లి చేసుకున్న త‌ర్వాత కూడా త‌న‌ను శారీర‌కంగా సుఖ పెట్టాల‌ని వేధిస్తున్నాడు. ఇందుకు ఆమె అంగీక‌రించ‌లేదు. యువ‌తిపై క‌క్ష పెంచుకున్న అత‌ను.. ప్రైవేటు వీడియోల‌ను ఆమె తండ్రితో పాటు ఇంకొంద‌రికి పంపాడు. 

దీంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన యువ‌తి కుటుంబ స‌భ్యులు సూర‌త్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. 


logo