శుక్రవారం 15 జనవరి 2021
Crime - Dec 17, 2020 , 11:42:09

విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి మృతి

విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి మృతి

వికారాబాద్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బోంరాస్‌పేట మండలం ఎన్నెమీది తండాకు చెందిన వడ్త్యా శంకర్ నాయక్(35) విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు..వేరుశనగ పంటకు స్ప్రింక్లర్ పైపులు పెట్టడానికి వెళ్లిన శంకర్‌ నాయక్‌ ప్రమాదవశాత్తు అడవి పందుల నుంచి రక్షణ కోసం వేసిన విద్యుత్ కంచెకు తగిలి మృతి చెందాడు. శంకర్‌ నాయక్‌ మృతితో బంధువుల రోదనలు మిన్నంటాయి.