ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Crime - Aug 13, 2020 , 19:31:13

చేపల వేటకు వెళ్లి..చెరువులో పడి వ్యక్తి మృతి?

చేపల వేటకు వెళ్లి..చెరువులో పడి వ్యక్తి మృతి?

ములుగు : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తాడ్వాయి మండలంలోని కొండపర్తి సమీపంలోని గొత్తికోయగూడెంకు చెందిన గంగయ్య చెరువులో పడి గల్లంతయ్యాడు. గంగయ్య అతడి భార్య, మరో ఇద్దరు కలిసి మండల కేంద్రం సమీపంలోని ఎర్రగుంట చెరువులోకి చేపలు పట్టేందుకు వెళ్లారు. మిగతా ముగ్గురు చెరువు కాలువలో చేపలు పడుతుండగా గంగయ్య చెరువులో పట్టేందుకు వెళ్లాడు. గంగయ్య వెళ్లి చాలాసేపు అవుతున్నా.. రాకపోవడంతో అనుమానం వచ్చి చెరువు వద్దకు వెళ్లి చూడగా గంగయ్య అక్కడ కనిపించలేదు. చెరువులో మునిగిపోయాడని భావించి ఎస్ఐ రవిందర్ కు సమాచారం అందించారు. సిబ్బంది తో కలిసి వెళ్లి చెరువులో గాలించినప్పటికి గంగయ్య ఆచూకీ లభించలేదు.


logo