శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Crime - Jul 13, 2020 , 11:35:28

మద్యం మత్తులో డ్రైనేజీలో పడి వ్యక్తి మృతి

మద్యం మత్తులో డ్రైనేజీలో పడి వ్యక్తి మృతి

ఖమ్మం : మద్యం మత్తులో డ్రైనేజీలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా ఖానాపురంలోని యూపీహెచ్ కాలనీలో చోటు చేసుకుంది. నేలకొండపల్లి మండలం మోటాపురం గ్రామానికి చెందిన మల్లెపల్లి రవి(40) ఫుల్‌గా మద్యం సేవించి మూత్ర నిసర్జనకు వెళ్లి ప్రమాదవశాత్తు డ్రైనేజీలో పడి మృతి చెందాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటికి తీసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo