శనివారం 27 ఫిబ్రవరి 2021
Crime - Jan 17, 2021 , 11:58:02

బైకును ఢీకొట్టిన కారు.. వ్యక్తి మృతి

బైకును ఢీకొట్టిన కారు.. వ్యక్తి మృతి

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బైకు, కారు ఢీకొన్నాయి. దీంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మృతిచెందారు. ఆదివారం ఉదయం కొత్తగూడెం నుంచి ఇల్లందు వైపు ఓ వ్యక్తి మోటార్ సైకిల్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో జిల్లాలోని టేకులపల్లి మండలం సిద్దాపురం సీతారాంపురం సమీపంలో ఎదురుగా వచ్చిన ఓ కారు.. బైక్‌ను ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, మృతుని వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.

VIDEOS

logo