ఆదివారం 17 జనవరి 2021
Crime - Oct 18, 2020 , 11:21:45

వ‌ర‌ద నీటిని బ‌య‌ట‌కు పంపేందుకు య‌త్నం.. య‌జ‌మాని మృతి

వ‌ర‌ద నీటిని బ‌య‌ట‌కు పంపేందుకు య‌త్నం.. య‌జ‌మాని మృతి

హైద‌రాబాద్ : న‌గ‌ర‌లోని ఉప్ప‌ల్ ప‌రిధిలో గ‌ల చిలుకాన‌గ‌ర్‌లో విషాద సంఘ‌ట‌న చోటుచేసుకుంది. గ‌డిచిన రాత్రి వ‌ర్షం కుండ‌పోత‌గా కురిసిన సంగ‌తి తెలిసిందే. వ‌ర్షానికి స్థానిక కృష్ణ‌వేణి టాలెంట్ స్కూల్ ప‌క్క‌న ఉన్న భ‌వ‌నం సెల్లార్ నీటితో నిండింది. ఈ నీటిని బ‌య‌ట‌కు పంపింగ్ చేసేందుకు ఇంటి య‌జ‌మాని నేటి తెల్ల‌వారుజామున మోటారును ఆన్ చేశాడు. ఈ క్ర‌మంలో ఒక్క‌సారిగా క‌రెంట్ షాక్‌కు గురయ్యాడు. వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా అప్ప‌టికే మృతిచెందిన‌ట్లు వైద్యులు తెలిపారు.