హైదరాబాద్ : నగరంలోని ట్యాంక్‌బండ్‌పై ఈ ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్యాంక్‌బండ్‌పై ఆగిఉన్న రెడీమిక్స్ వాహనాన్ని బైక్ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.