శనివారం 15 ఆగస్టు 2020
Crime - Feb 16, 2020 , 13:05:19

మానేరు వంతెన పైనుంచి కిందపడిన కారు.. వీడియో

మానేరు వంతెన పైనుంచి కిందపడిన కారు.. వీడియో

కరీంనగర్‌ : కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధి అలుగునూర్‌ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. కరీంనగర్‌లోని సుభాష్‌నగర్‌కి చెందిన గండి శ్రీనివాస్‌(40) భార్యతో కలిసి కారులో కరీంనగర్‌ నుంచి కొమురవెల్లి మల్లన్న దర్శనానికి   వెళ్తున్నాడు. అలుగునూర్‌ మానేరు వంతెన వద్దకు చేరుకోగానే కారు అదుపుతప్పి బ్రిడ్జి పైనుంచి కిందపడింది. ఈ ఘటనలో భర్త శ్రీనివాస్‌ మృతిచెందాడు. భార్యకు గాయాలయ్యాయి. కాగా ప్రమాద ఘటనను పరిశీలిస్తున్న ఓ కానిస్టేబుల్‌ ప్రమాదవశాత్తు అదుపుతప్పి జారీ వంతెనపై నుంచి కింద పడ్డాడు. ఈ ఘటనలో చికిత్స పొందుతూ కానిస్టేబుల్‌ చంద్రశేఖర్‌ మృతి చెందాడు.  ప్రమాద స్థలాన్ని మంత్రి గంగుల కమలాకర్‌ పరిశీలించారు. 
logo