సోమవారం 13 జూలై 2020
Crime - Jun 06, 2020 , 07:03:48

కాపాడేందుకు వెళ్లి మత్యువాత

కాపాడేందుకు వెళ్లి మత్యువాత

ములుగు : గాయపడ్డ వ్యక్తిని కాపాడేందుకు వెళ్లి మరో వ్యక్తిని మృత్యువాతపడ్డాడు. ఈ విషాద సంఘటన ములుగు జిల్లా మంగపేట మండలం కొత్తమల్లూరులో చోటుచేసుకుంది. ఆగివున్న లారీని బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అదుపుతప్పి ఢీకొట్టాడు. దీంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తికి గాయాలయ్యాయి. ఇది గమనించిన ముగ్గురు వ్యక్తులు గాయపడిన వ్యక్తిని కాపాడేందుకు వెళ్లగా వారిని మరో బైక్‌ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతిచెందారు. ఇద్దరికి గాయాలయ్యాయి.


logo