మంగళవారం 26 జనవరి 2021
Crime - Dec 26, 2020 , 08:43:51

ఆదిలాబాద్‌ కాల్పుల్లో గాయపడిన వ్యక్తి మృతి

ఆదిలాబాద్‌ కాల్పుల్లో గాయపడిన వ్యక్తి మృతి

హైదరాబాద్‌: గతవారం జరిగిన ఆదిలాబాద్‌ కాల్పుల ఘటనలో గాయపడిన సయ్యద్‌ జమీర్‌ మృతిచెందారు.  తీవ్ర గాయాలతో నగరంలోని నిమ్స్‌లో చికిత్స పొందుతున్న జమీర్‌.. పరిస్థితి విషమించడంతో శనివారం ఉదయం మరణించారు. ఈ నెల 18న ఆదిలాబాద్‌ పట్టణంలోని తాటిగూడలో ఎంఐఎం నేత, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ఫారుఖ్‌ అహ్మద్‌ తుపాఖీ, తల్వార్‌తో వీరంగం సృష్టించాడు. పాత కక్షలతో ప్రత్యర్థి వర్గానికి చెందిన సయ్యద్‌ జమీర్‌, మోతేషాన్‌పై ఫారుఖ్‌ కాల్పులు జరిపాడు. అంతటితో ఆగకుండా సయ్యద్‌ మన్నన్‌పై తల్వార్‌తో దాడిచేశాడు. దీంతో  తీవ్రంగా గాయపడిన వారిని రిమ్స్‌ దవాఖానకు తరలించారు. అయితే సయ్యద్‌ జమీర్‌ పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. ఆయన ఇవాళ ఉదయం చనిపోయారు.   


logo