గురువారం 01 అక్టోబర్ 2020
Crime - Jun 21, 2020 , 11:54:12

తాటిచెట్టుపై నుండి పడి గీతకార్మికుడు మృతి

తాటిచెట్టుపై నుండి పడి గీతకార్మికుడు మృతి

యాదాద్రి భువనగిరి : జిల్లాలోని వలిగొండ మండలం దాసిరెడ్డిగూడెం గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కల్లుగీత కార్మికుడు బందారపు బిక్షపతి ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుండి జారిపడి అక్కడికక్కడే మృతిచెందాడు. గీతకార్మికుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

చెరువులో పడి యువకుడి మృతి..

రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి ఉస్మాన్‌ నగర్‌లోని బురాన్‌ఖాన్‌ చెరువులో పడి ఓ యువకుడు మృతిచెందాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.


logo