సోమవారం 06 జూలై 2020
Crime - May 30, 2020 , 06:32:08

లారీని ఢీకొన్న కూరగాయల వ్యాను... వ్యక్తి మృతి

లారీని ఢీకొన్న కూరగాయల వ్యాను... వ్యక్తి మృతి

రంగారెడ్డి : జిల్లాలోని కందుకూరు పరిధి కొత్తగూడ గేట్‌ వద్ద ఈ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం సంభవించింది. ముందు వెళ్తున్న లారీని వెనుక వస్తున్న కూరగాయల వ్యాను అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. రైతులు వ్యాన్లలో కూరగాయలు తరలిస్తుండగా ప్రమాదం భారిన పడ్డారు. ప్రమాద స్థలాన్ని సీఐ జంగయ్య పరిశీలించారు.


logo