మంగళవారం 07 జూలై 2020
Crime - May 09, 2020 , 16:17:05

సోడా గ్యాస్‌ సిలిండర్‌ పేలి వ్యక్తి మృతి

సోడా గ్యాస్‌ సిలిండర్‌ పేలి వ్యక్తి మృతి

నారాయణపేట : జిల్లాలోని మక్తల్‌ పాతబజార్‌లో సోడా గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఓ వ్యక్తి మృతిచెందాడు. సోడా గ్యాస్‌ సిలిండర్‌ పేలి భరత్‌సింహా గౌడ్‌ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. సోడా తయారు చేస్తుండగా సిలిండర్‌ ఒక్కసారిగా పేలింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.


logo