మరో ప్రాణం తీసిన ఆన్లైన్ రుణం

పెద్దపల్లి : ఆన్లైన్ రుణం మరో వ్యక్తిని బలిగొంది. పెద్దపల్లి జిల్లాలో గురువారం ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలివి.. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందిన సంతోశ్ కుమార్ (36) పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎరువుల కర్మాగారంలో సైట్ ఇన్చార్జిగా పని చేస్తున్నాడు. వ్యక్తిగత అవసరాల నిమిత్తం రుణ యాప్‌లో కొంత మొత్తం అప్పుచేశాడు. సకాలంలో డబ్బు చెల్లించకపోవడంతో రుణం ఇచ్చిన సంస్థ నుంచి వేధింపులు అధికమయ్యాయి.
దీంతో తీవ్ర మనోవేదనకులో బుధవారం పురుగుల మందు తాగాడు. స్థానికులు చికిత్స నిమిత్తం తరలించగా కోమాలోకి వెళ్లినట్లు వైద్యులు నిర్ధారించారు. దవాఖాన నుంచి స్వస్థలం విశాఖకు తరలిస్తుండగా బుధవారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులు ఎన్టీపీసీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొన్న నటుడు నవీన్ చంద్ర
- ఫేస్బుక్ నుంచి ఆటోమేటిగ్గా లాగౌట్.. ఎందుకు?
- మహా శివరాత్రి కానుకగా `జాతి రత్నాలు`
- ఆత్మనిర్భర్ భారత్‌లో యూపీ కీలకం : మోదీ
- ‘రైతు ట్రాక్టర్లకు డీజిల్ సరఫరా నిలిపివేయండి..’
- కృష్ణుడ్ని కలువాలంటూ.. భవనం పైనుంచి దూకిన మహిళ
- ఢిల్లీలో హత్య.. సీసీ కెమెరాలో రికార్డు
- బొలెరో వాహనం బోల్తా.. వ్యక్తి దుర్మరణం
- బీజేపీతోనే అవినీతి నిర్మూలన : అమిత్ షా
- వరుణ్‌ధవన్ వెడ్డింగ్‌కు తారలు..ఫొటోలు, వీడియో