బుధవారం 27 జనవరి 2021
Crime - Oct 23, 2020 , 19:06:39

ప్రాణం తీసిన మ‌ద్యం పందెం

ప్రాణం తీసిన మ‌ద్యం పందెం

కామారెడ్డి : ప‌ందెం స‌ర‌దా ఓ ప్రాణాన్ని బ‌లిగొంది. ఈ విషాద సంఘ‌ట‌న కామారెడ్డి జిల్లా బాన్సువాడ‌లో గురువారం రాత్రి చోటుచేసుకుంది. నిన్న రాత్రి మ‌ద్యం తాగే విష‌యంలో స్నేహితుల మ‌ధ్య‌ పందెం న‌డిచింది. సోమేశ్వ‌రం సాయిలు(40) అనే వ్య‌క్తి నీళ్లు లేకుండా మ‌ద్యం తాగాడు. దీంతో వ్య‌క్తి మృతిచెందాడు. మృతుడిని బాన్సువాడ శాంతిన‌గ‌ర్ వాసి సోమేశ్వ‌రం సాయిలుగా గుర్తించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేశారు.  


logo