మంగళవారం 26 జనవరి 2021
Crime - Dec 10, 2020 , 10:16:01

కారులో వ్యక్తి మృతదేహం

కారులో వ్యక్తి మృతదేహం

హైదరాబాద్‌ : నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణంలోని పోస్టాఫీస్‌ ఆగి ఉన్న కారులో వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. మృతుడిని హైదరాబాద్‌ పార్సీగుట్టకు చెందిన శ్రీనివాస్‌గౌడ్‌గా గుర్తించారు. మృతుడు మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా.. దారి మధ్యలో బోధన్‌ వద్ద ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కారును రోడ్డు నిలిపినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కారులో తనతో ఎవరూ లేకపోవడంతో వైద్యం అందక మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా సంఘటనా స్థలాన్ని సీఐ రామన్‌ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోర్టుమార్టంకు తరలించారు.


logo