గురువారం 21 జనవరి 2021
Crime - Oct 04, 2020 , 12:27:24

ఫ్లైఓవ‌ర్ నుండి ప‌డిన స్క్రాప్.. కారు య‌జ‌మాని మృతి

ఫ్లైఓవ‌ర్ నుండి ప‌డిన స్క్రాప్.. కారు య‌జ‌మాని మృతి

థానే : మహారాష్ట్రలోని థానే నగరంలోని ఘోడ్‌బందర్ రోడ్‌లోని వాగ్‌బిల్ నాకా ఫ్లైఓవర్‌పై గ‌డిచిన రాత్రి 10 గంట‌ల స‌మ‌యంలో రోడ్డు ప్రమాదం సంభ‌వించింది. డివైడ‌ర్‌ను ఢీకొని ఓ ట్ర‌క్కు బోల్తా ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో ట్ర‌క్కులోని స్క్రాప్ ఫ్లైఓవ‌ర్ నుండి ఒక్క‌సారిగా కింద ఉన్న కారుపై ప‌డిపోయింది. దీంతో కారు యజమాని మృతి చెంద‌గా డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి త‌ర‌లించారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి త‌ర‌లించారు. ట్రక్ డ్రైవర్‌పై కేసు న‌మోదు చేసిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. 


logo