శుక్రవారం 22 జనవరి 2021
Crime - Nov 04, 2020 , 18:16:06

సిద్దిపేట‌లో గుర్తుతెలియ‌ని వ్య‌క్తి కాలిన‌ మృత‌దేహం

సిద్దిపేట‌లో గుర్తుతెలియ‌ని వ్య‌క్తి కాలిన‌ మృత‌దేహం

సిద్దిపేట : జిల్లాలో గుర్తుతెలియ‌ని ఓ వ్య‌క్తి మృత‌దేహాన్ని పోలీసులు క‌నుగొన్నారు. 25 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు గ‌ల వ్య‌క్తి మృత‌దేహాన్ని గుర్తుతెలియ‌ని దుండ‌గులు ములుగు మండ‌లంలోని నాగిరెడ్డిప‌ల్లి గ్రామానికి తీసుకువ‌చ్చి త‌గుల‌బెట్టారు. మంగ‌ళ‌వారం రాత్రి ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. స్థానికులు పోలీసుల‌ను అప్ర‌మ‌త్తం చేయ‌డంతో బుధ‌వారం ఉద‌యం సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. వ్య‌క్తి గుర్తింపు తెలిపే ఎలాంటి ఆధారాలు ల‌భించ‌లేదు. మృత‌దేహాన్ని గ‌జ్వేల్ ఏరియా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. గ్రామానికి తీసుకురావ‌డం కంటే ముందే వ్య‌క్తిని వేరే చోట చంపిన‌ట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. 


logo