శుక్రవారం 22 జనవరి 2021
Crime - Oct 11, 2020 , 16:43:43

కట్నం కోసం ఘాతుకం.. భార్య ప్రైవేట్ భాగాలకు నిప్పంటించిన భర్త

కట్నం కోసం ఘాతుకం.. భార్య ప్రైవేట్ భాగాలకు నిప్పంటించిన భర్త

బెంగళూరు : అదనపు కట్నం కోసం భార్యపై భర్త దాష్టీకానికి ఒడిగట్టాడు. పుట్టింటి నుంచి భార్య డబ్బులు తెచ్చేందుకు నిరాకరించిందన్న కోపంతో ప్రైవేట్‌ భాగాలపై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. బెంగళూరులోని రామ్మూర్తినగర్‌లో బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రామ్మూర్తినగర్‌లో పాన్‌షాపు నిర్వహించే సూరజ్ సింగ్ అనే వ్యక్తికి ఏడాది క్రితం వివాహమైంది. వివాహ సమయంలో అత్తవారు అతడికి కట్నంగా నగలు, నగదు ముట్టబెప్పారు. ఆరునెలలుగా సూరజ్‌తోపాటు అతడి తల్లి అదనపు కట్నం కోసం యువతిని వేధిస్తున్నారు.

ఈ నెల 7న ఇదే విషయంలో దంపతుల నడుమ వాగ్వాదం జరిగింది. తన తల్లిదండ్రులు ముట్టజెప్పిన విలువైన వస్తువులన్నీ తిరిగిస్తే తన దారి తాను భార్య అనడంతో కోపోద్రుక్తుడైన సూరజ్‌ ఆమె ప్రైవేట్‌ బాగాలపై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. కేకలు విన్న ఇరుగుపొరుగువారు మంటలు ఆర్పి సమీపంలోని దవాఖానకు తీసుకెళ్లారు. ప్రస్తుతం బాధితురాలు చికిత్స పొందుతోందని, ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సూరజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతడి తల్లి పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo