శుక్రవారం 29 మే 2020
Crime - Mar 13, 2020 , 10:19:03

భూతగాదాలతో వ్యక్తి దారుణ హత్య

భూతగాదాలతో వ్యక్తి దారుణ హత్య

జనగామ: జిల్లాలోని జనగామ మండలం ఓబుల్‌ కేశవాపూర్‌ గ్రామం సమీపంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలు, భూతగాదాల కారణంగా లింగాల ఘనపురం మండలం కొత్తపల్లికి చెందిన మరాఠి మల్లయ్య హత్యకు గురయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు  బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దాయాదులే ఈ హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 


logo