సోమవారం 26 అక్టోబర్ 2020
Crime - Sep 28, 2020 , 19:26:41

తండ్రిని కొట్టి చంపిన త‌న‌యుడు

తండ్రిని కొట్టి చంపిన త‌న‌యుడు

ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఘాజీపూర్ జిల్లా క‌రీముద్దీన్ ఏరియాలో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. సొంత కొడుకే తండ్రిని అతి కిరాతంగా కొట్టి చంపాడు. అనంత‌రం ఇంట్లోనే మృత‌దేహాన్ని పాతిపెట్టాడు. అయితే, ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఇచ్చిన స‌మాచారం మేర‌కు పాతిపెట్టిన మృత‌దేహాన్ని వెలికితీసి పోస్టుమార్టానికి త‌ర‌లించారు.

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. రామాశిష్ (46), రాహుల్ (20) తండ్రీ కొడుకులు. డ‌బ్బుల విష‌య‌మై శనివారం రాత్రి ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. అయితే మాటామ‌టా పెరుగ‌డంతో విచ‌క్ష‌ణ కోల్పోయిన రాహుల్ తండ్రిపై విరుచుకుప‌డ్డాడు. దీంతో రామాశిశ్ అక్క‌డిక‌క్క‌డే మృతిచెందాడు.        

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo