సోమవారం 25 జనవరి 2021
Crime - Sep 28, 2020 , 17:52:09

ప్రేమించాడ‌ని యువ‌కుడిని కొట్టి చంపారు!

ప్రేమించాడ‌ని యువ‌కుడిని కొట్టి చంపారు!

ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం బాల్లియా జిల్లాలో దారుణం జ‌రిగింది. ప్రేమ వ్య‌వ‌హారం న‌డుపుతున్నాడ‌నే కోపంతో రాకేష్ అనే 21 ఏండ్ల యువ‌కుడిపై అమ్మాయి కుటుంబ‌స‌భ్యులు క‌ర్ర‌ల‌తో విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డ్డ రాకేష్‌ను అతని కుటుంబ‌స‌భ్యులు ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా.. అక్క‌డ వైద్యులు చికిత్స మొద‌లుపెట్ట‌క‌ముందే ప్రాణాలు కోల్పోయాడు. బ‌ల్లియా జిల్లా రాస్రా ఏరియాలోని గోపాల్‌పూర్ గ్రామంలో ఆదివారం రాత్రి ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

రాకేష్ కుటుంబ‌స‌భ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న‌ పోలీసులు.. మృత‌దేహాన్ని పోస్టుమార్టానికి త‌ర‌లించారు. దాడికి పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితుల‌ను అరెస్ట్ చేశారు. కాగా, రాకేష్‌ను మాట్లాడుకుందాం ర‌మ్మ‌ని బ‌య‌టికి పిలిచి దాడికి పాల్ప‌డిన‌ట్లు పోలీసుల ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది.      

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo