మంగళవారం 19 జనవరి 2021
Crime - Nov 20, 2020 , 18:29:02

గుట్ట‌మ‌ల్లారంలో దారుణం.. వ్య‌క్తిని కొట్టిచంపిన వైనం

గుట్ట‌మ‌ల్లారంలో దారుణం.. వ్య‌క్తిని కొట్టిచంపిన వైనం

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం : గుర్తుతెలియ‌ని వ్య‌క్తుల చేతుల్లో ఓ వ్య‌క్తి దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు. ఈ విషాద సంఘ‌ట‌న భ‌ధ్రాద్రి కొత్త‌గూడెం జిల్లా మ‌ణుగూరు మండ‌లం గుట్ట‌మ‌ల్లారం గ్రామంలో శుక్ర‌వారం చోటుచేసుకుంది. మ‌ణుగూరు సీఐ న‌రేశ్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మృతుడిని షేక్ పాషా(35)గా గుర్తించారు. ప్రైవేటు ఎల‌క్ర్టిషియ‌న్‌గా ప‌నిచేస్తున్నాడు. రాత్రి స‌మ‌యంలో గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు క‌ర్ర‌ల‌తో విచ‌క్ష‌ణార‌హితంగా కొట్టి హ‌త‌మార్చారు. సీఐ న‌రేశ్‌, అశ్వాపురం ఎస్ఐ స‌ట్ల రాజు సంఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.