e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home క్రైమ్‌ ఆవుల స్మ‌గ్లింగ్ అనుమానంతో దాడి.. ఒక‌రి మృతి

ఆవుల స్మ‌గ్లింగ్ అనుమానంతో దాడి.. ఒక‌రి మృతి

ఆవుల స్మ‌గ్లింగ్ అనుమానంతో దాడి.. ఒక‌రి మృతి

జైపూర్‌: ఆవుల‌ను అక్ర‌మంగా ర‌వాణా చేస్తున్నార‌న్న అనుమానంతో ఇద్ద‌రిపై కొంద‌రు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డిన ఒక వ్యక్తి మ‌ర‌ణించాడు. రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్ జిల్లా బేగు న‌గ‌రం స‌మీపంలో ఆదివారం రాత్రి ఈ ఘ‌ట‌న జ‌రిగింది. వాహ‌నంలో ఆవుల‌ను త‌ర‌లిస్తున్న ఇద్ద‌రిని కొంద‌రు గ్రామ‌స్తులు అడ్డుకుని దాడి చేశారు. వారి వ‌ద్ద ఉన్న ప‌త్రాలు. మొబైల్ ఫోన్లు లాక్కొన్నారు. స‌మాచారం అందుకున్న పోలీసులు అక్క‌డ‌కు వెళ్ల‌గా, దాడి చేసిన వారు పారిపోయారు. తీవ్రంగా గాయ‌ప‌డిన బాబు లాల్ భిల్. పింటును పోలీసులు ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. అయితే చికిత్స పొందుతూ బాబు లాల్ చ‌నిపోయాడు. మృతుడు మధ్యప్రదేశ్‌లోని అచల్పూర్‌కు చెందిన వ్య‌క్తిగా గుర్తించారు. దాడి చేసిన వారిలో కొంద‌రిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆవుల స్మ‌గ్లింగ్ అనుమానంతో దాడి.. ఒక‌రి మృతి
ఆవుల స్మ‌గ్లింగ్ అనుమానంతో దాడి.. ఒక‌రి మృతి
ఆవుల స్మ‌గ్లింగ్ అనుమానంతో దాడి.. ఒక‌రి మృతి

ట్రెండింగ్‌

Advertisement