సోమవారం 21 సెప్టెంబర్ 2020
Crime - Aug 05, 2020 , 17:53:50

కొవిడ్‌ ఇంజెక్షన్‌ను అధిక ధరకు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్‌

కొవిడ్‌ ఇంజెక్షన్‌ను అధిక ధరకు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్‌

ముంబై: కొవిడ్‌-19తో బాధపడుతున్న వారికి కొందరు నిస్వార్థంగా సేవచేస్తుంటే, మరికొందరు ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు. కరోనా రోగి చికిత్సకు ఉపయోగించే ఓ ఇంజక్షన్‌ను  అధిక ధరకు విక్రయిస్తున్న వ్యక్తిని ముంబై క్రైం బ్రాంచ్‌ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. అతడు ఈ ఇంజక్షన్‌ను అసలు ధరకంటే మూడు రెట్లు ఎక్కువకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. 

ఉత్తరాఖండ్‌కు చెందిన అజాం నాసిర్‌ (30)కు ఢిలీల్లో సైన్‌బోర్డ్స్‌ వ్యాపారం ఉంది. లాక్‌డౌన్‌ కారణంగా మాస్కులు, శానిటైజర్లు అమ్ముతున్నాడు.  కాగా, యాక్టెమ్రా 400 ఎంజీ లేదా టోసిలిజుమాబ్‌ అనే ఇంజక్షన్‌ను ముంబైలో అధిక ధరకు విక్రయించేందుకు ఢిల్లీలోని ఓ కెమిస్ట్‌ షాప్‌ నాసిర్‌ను సంప్రదించగా, అతడు అంగీకరించాడు. 

ఇంజక్షన్లు అమ్మేందుకు ముంబైలో అడుగుపెట్టాడు. కాగా, అనుమానాస్పదంగా కనిపించిన అతడిని బాంబ్రాలో ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారించగా,  టోసిలిజుమాబ్ ఇంజక్షన్‌ అమ్మేందుకు వచ్చానని అంగీకరించాడు. దాని అసలు ధర ఒక్క ఇంజక్షన్‌కు రూ. 32,000 ఉండగా, నాసిర్‌ రూ. లక్షకు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడినుంచి 15 బాక్సుల ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. నాసిర్‌ను అరెస్ట్‌ చేసి, పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo