బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Jun 23, 2020 , 15:25:52

భార్య చితిలోకి దూకిన భ‌ర్త‌..

భార్య చితిలోకి దూకిన భ‌ర్త‌..

ముంబై : ఆ దంప‌తుల‌కు వివాహం జ‌రిగి స‌రిగ్గా మూడు నెల‌లు మాత్ర‌మే అవుతోంది. ముచ్చ‌ట‌గా గ‌డ‌పాల్సిన వారి జీవితాలు అర్ధాంత‌రంగా ముగిశాయి. భార్య బావిలో దూకి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఆమె మృత‌దేహానికి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హిస్తుండ‌గా.. ఆ చితిలోకి భ‌ర్త దూకాడు. ఈ విషాద ఘ‌ట‌న మ‌హారాష్ర్ట చంద్ర‌పూర్ జిల్లాలోని భాంగ్రామ్ త‌లోధి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. 

కిషోర్ ఖాతిక్ అనే యువ‌కుడు.. రుచితా చిట్టావ‌ర్ ను ఈ ఏడాది మార్చి 19న పెళ్లి చేసుకున్నాడు. వారి సంసార జీవితంగా సాఫీగానే సాగిపోతోంది. రుచితా ప్ర‌స్తుతం మూడు నెల‌ల గ‌ర్భిణి. అనారోగ్యంతో ఉన్న త‌ల్లిని చూసేందుకు నాలుగు రోజుల క్రితం ఆమె త‌న పుట్టింటికి వెళ్లింది.  

త‌న భార్య‌ను ఇంటికి తీసుకువ‌చ్చేందుకు కిషోర్.. ఆదివారం అత్త‌గారింటికి వెళ్లాడు. రుచితా అప్ప‌టికే ఇంట్లో లేదు. ఆమె అదృశ్య‌మైంద‌ని తెలుసుకున్న కుటుంబ స‌భ్యులు.. చుట్టుప‌క్క‌ల వెతికారు. గ్రామానికి స‌మీపంలో ఉన్న ఓ బావిలో రుచితా మృత‌దేహం ల‌భ్య‌మైంది. దీంతో కిషోర్ తో పాటు ఆమె త‌ల్లిదండ్రులు శోక‌సంద్రంలో మునిగిపోయారు. 

రుచితా అంత్య‌క్రియ‌లు సోమ‌వారం నిర్వ‌హించారు. ఆమె చితికి నిప్పు పెట్టిన కాసేప‌టికే కిషోర్ కూడా ఆ చితిలోకి దూకాడు. అక్క‌డున్న వారంతా అత‌న్ని ర‌క్షించారు. మ‌ళ్లీ కాసేప‌టికే.. త‌న భార్య ఆత్మ‌హ‌త్య చేసుకున్న బావి వ‌ద్ద‌కు వెళ్లి.. దూకాడు. దీంతో కిషోర్ ప్రాణాలు కోల్పోయాడు. అయితే రుచిత ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. 


logo