శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Crime - Aug 11, 2020 , 10:21:36

మోదీకి హాని తలపెడతానని బెదిరించిన వ్యక్తి అరెస్టు

మోదీకి హాని తలపెడతానని బెదిరించిన వ్యక్తి అరెస్టు

నోయిడా : పోలీస్‌ అత్యవసర నెంబర్‌ '100'కు ఫోన్‌చేసి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి హాని చేస్తామని బెదిరించిన వ్యక్తిని సోమవారం పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుడిని నోయిడాలో నివసిస్తున్న హర్యానాకు చెందిన హర్భజన్ సింగ్‌గా గుర్తించారు. వ్యక్తి సింగ్‌ మాదకద్రవ్యాలకు బానిసైనట్లు కనిపిస్తున్నాడని పోలీసులు తెలిపారు. 

హర్భజన్‌ అనే వ్యక్తి నోయిడాలోని ఫేజ్3 పోలీస్ స్టేషన్‌ పరిధి డయల్ 100కు కాల్ చేసి, ప్రధాని నరేంద్ర మోదీకి హాని తలపెడతానని బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు అతడిని విచారిస్తున్నారు. అతను పూర్తిగా మత్తుపదార్థాలకు బానిసైనట్లు కనిపిస్తున్నాడని నోయిడా పోలీస్‌ ఆఫీసర్‌ అంకుర్‌ అగర్వాల్‌ అన్నారు. ఇతర వివరాలను తెలుసుకోవడానికి అతడిని వైద్య పరీక్షల కోసం పంపినట్లు పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo