శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Sep 10, 2020 , 07:06:06

కూతురిపై తండ్రి లైంగిక దాడికి యత్నం..

కూతురిపై తండ్రి లైంగిక దాడికి యత్నం..

కోయంబత్తూర్‌ : కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కుమార్తెపై లైంగిక దాడికి యత్నించాడు. మద్యం మత్తులో వావీవరసలు మరిచి ఘాతుకానికి యత్నించగా బాలిక మృగాడి బారి నుంచి తప్పించుకుంది. తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

దినసరి కూలీగా పని చేసే వ్యక్తి కుటుంబంతో కలిసి కోయంబత్తూరులోని మణికరన్పాలయం ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. రెండురోజుల క్రితం పూటుగా మద్యం తాగి వచ్చి 15 ఏండ్ల కుమార్తెపై లైంగిక దాడికి యత్నించాడు. బాలిక అతడి నుంచి తప్పించుకొని బంధువుల సహాయంతో మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోక్సో చట్టంతోపాటు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి కోయంబత్తూరు సెంట్రల్‌ తరలించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo