గురువారం 29 అక్టోబర్ 2020
Crime - Sep 20, 2020 , 09:01:29

బాలికపై లైంగిక దాడి.. నిందితుడి అరెస్టు

బాలికపై లైంగిక దాడి.. నిందితుడి అరెస్టు

గౌతమ్ బుద్ధనగర్ : ఉత్తర ప్రదేశ్‌లో 15 ఏండ్ల బాలికపై లైంగిక దాడి జరిగింది. కాస్గంజ్ జిల్లాకు చెందిన వ్యక్తి నోయిడా సెక్టార్ 39లోని ఓ గ్రామానికి వచ్చి సెలూన్‌ షాపులో పనిచేస్తూ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. తన ఇంటికి సమీపంలోనే ఉండే 15 ఏండ్ల బాలికపై అతడి కన్నుపడింది. గురువారం పని ఉందంటూ బాలికను ఇంటికి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. బాలిక ఇంటికి వచ్చి విషయం కుటుంబ సభ్యులకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు సెక్టార్ 39 పోలీస్‌ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆజాద్ సింగ్ తోమర్ తెలిపారు. బాలికపై లైంగికదాడి జరిగినట్లు ఆధారాలు సేకరించగలిగామని అదనపు పోలీసు డిప్యూటీ కమిషనర్ (డీసీసీ) రణవిజయ్ సింగ్ చెప్పారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo