శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Sep 06, 2020 , 19:25:24

మ‌హిళ‌ల‌‌కు వీడియో కాల్స్ చేసి వేధిస్తున్న వ్య‌క్తి అరెస్ట్‌

మ‌హిళ‌ల‌‌కు వీడియో కాల్స్ చేసి వేధిస్తున్న వ్య‌క్తి అరెస్ట్‌

ఘజియాబాద్ : మ‌హిళ‌లు, యువ‌తుల‌కు వాట్సాప్‌లో వీడియో కాల్స్ చేస్తూ వేధింపుల‌కు పాల్ప‌డుతున్న యువ‌కుడిని సైబ‌ర్ సెల్ సిబ్బంది శ‌నివారం అరెస్టు చేశారు. యువ‌కుడి సెల‌ఫోన్‌లో 500 మందికి పైగా మ‌హిళ‌లు, యువ‌తులు, బాలిక‌ల ఫోన్ నెంబ‌ర్లు, చాట్‌లు దొరికిన‌ట్లు వారు తెలిపారు. 

వివ‌రాలు.. హర్యానాలోని రోహ‌త‌క్‌కు చెందిన 22 ఏండ్ల దీప‌క్.. గ‌ర్ల్‌ఫ్రెండ్ లేక‌పోవ‌డంతో ఢిల్లీ, ముంబై, పంజాబ్, యూపీ సహా పలు రాష్ట్రాల మ‌హిళ‌లు, యువ‌తుల అభిరుచులు తెలుసుకోవ‌డం కోసం వాట్స‌ప్ వీడియో కాల్ చేసేవాడు. చాటింగ్‌లు చేస్తూ వారిని వేధిస్తుండేవాడు. గుర్తు తెలియ‌ని నెంబ‌ర్ నుంచి త‌ర‌చూ వీడియో కాల్ వ‌స్తుంద‌ని ఓ యువ‌తి ఘజియాబాద్‌లోని కవినగర్ పోలీస్ స్టేషన్‌లో యువకుడిపై ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న సైబ‌ర్ సెల్ పోలీసులు నెట్‌‌వ‌ర్క్ ట్రేజింగ్ ద్వారా యువ‌కుడిని అరెస్టు చేశారు.  

ఘజియాబాద్ ఎస్పీ అభిషేక్ వర్మ మాట్లాడుతూ నిందితుడు దీపక్ ఒక యాప్ ఉపయోగించి మహిళల నెంబ‌ర్లు సేక‌రించి వేధిస్తున్నాడన్నారు. క‌వినగర్ పోలీస్ స్టేషన్‌లో యువ‌తి ఫిర్యాదు త‌రువాత సైబర్ సెల్ బృందం ఐపీ చిరునామా ద్వారా నిందితుడి వ‌ద్ద‌కు చేరుకున్న‌ట్లు తెలిపారు. త‌న‌కు బాలికలతో మాత్రమే మాట్లాడటం ఇష్టమని, గ‌ర్ల్‌ఫ్రెండ్ లేక‌పోవ‌డంతో వారి అభిరుచులు తెలుసుకోవ‌డం కోసం మెసేజులు, వీడియో కాల్స్ చేస్తుండేవాడిన‌ని దీప‌క్ విచార‌ణ‌లో తెలిపిన‌ట్లు ఎస్పీ పేర్కొన్నారు. ద‌క్షిణ‌కొరియా, ఫిలిప్సిన్‌ ఐడీలు క‌లిగిన‌ ఫోన్ నెంబ‌ర్ల‌తో నిందితుడు మ‌హిళ‌ల‌కు కాల్స్ చేసేవాడ‌ని ఆయ‌న తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo