శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Crime - Sep 05, 2020 , 19:04:29

రామ మందిర నిర్మాణం పేరిట చందాలు వ‌సూలు చేస్తున్న వ్య‌క్తి అరెస్ట్‌

రామ మందిర నిర్మాణం పేరిట చందాలు వ‌సూలు చేస్తున్న వ్య‌క్తి అరెస్ట్‌

మీరట్ : అయోధ్యలో రామ మందిర నిర్మాణం పేరిట ప్ర‌జ‌ల వ‌ద్ద నుంచి డ‌బ్బ వ‌సూలు చేస్తున్న వ్య‌క్తిని శ‌నివారం అరెస్టు చేసిన‌ట్లు సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ అజయ్ సహాని తెలిపారు.

వివ‌రాలు.. మీర‌ట్‌కు చెందిన న‌రేంద్ర రానా అయోధ్యలో ఆలయాన్ని నిర్మించే బాధ్యతను అప్పగించిన శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పేరిట నకిలీ రశీదులను ముద్రించాడు. వాటి ద్వారా ప్ర‌జ‌ల‌ను మోస‌గిస్తూ చందాలు వ‌సూలు చేయ‌డం ప్రారంభించాడు. దీనికి సంబంధించి జాగృతి విహార్ ప్రాంతంలో న‌రేంద్ర ఓ కార్యాల‌యాన్ని కూడా తెరిచి అక్క‌డి నుంచి వ‌సూళ్ల కార్య‌క్ర‌మం చేప‌డుతున్నాడు. 

ఓ వ్య‌క్తి ఫిర్యాదు మేర‌కు న‌రేంద్ర రానాను అదుపులోకి తీసుకున్న పోలీసులు అత‌డి వ‌ద్ద నుంచి రామ మందిర ట్ర‌స్టు పేరిట ఉన్న ర‌శీదులు, కొంత న‌గ‌దును స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలిపారు. కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo