శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Jul 31, 2020 , 19:42:49

బాలివుడ్‌ యాక్టర్‌ కుమార్తెను బ్లాక్‌మెయిల్‌ చేసిన వ్యక్తి అరెస్టు

బాలివుడ్‌ యాక్టర్‌ కుమార్తెను బ్లాక్‌మెయిల్‌ చేసిన వ్యక్తి అరెస్టు

ముంబై : ఓ బాలివుడ్‌ స్టార్‌ కుమార్తెను బ్లాక్‌మెయిల్‌ చేసినందుకు గాను 25 ఏండ్ల యువకుడిని ముంబై క్రైమ్ బ్రాంచ్ గురువారం అరెస్టు చేసింది. బాలివుడ్‌కు చెందిన ఓ 60 ఏండ్ల స్టార్‌ నటుడి కుమార్తెకు సంబంధించిన అశ్లీల చిత్రాలను కలిగి ఉండి వాటిని సోషల్‌మీడియాలో పోస్టు చేస్తానని యువకుడు బ్లాక్‌మెయిల్‌ చేసినట్లు సమాచారం. 

ముంబై క్రైమ్ బ్రాంచ్ యూనిట్ 11కు చెందిన సీనియర్ పోలీస్ ఇన్స్‌పెక్టర్‌ చిమాజీ ఆధవ్ మాట్లాడుతూ నిందితుడు యువతి వీడియోను బహిర్గతం చేస్తానని, డబ్బు డిమాండ్ చేయగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. నిందితుడు బాంద్రా కార్టర్ రోడ్డులో నివాసముంటుండగా అతడి సోదరి బాధితురాలు చదివిన కళాశాలలోనే చదివినట్లు సమాచారం.

నిందితుడు ఇన్‌స్టాగ్రాం ద్వారా బాధితురాలితో కనెక్ట్ అయ్యాడని, అతను యువతి అశ్లీల చిత్రాలను కలిగి ఉండి డబ్బు చెల్లించకపోతే ఫోటోలను లీక్ చేస్తానని బెదిరించాడు. యువతి ఫిర్యాదు మేరకు గురువారం యువకుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo