గురువారం 24 సెప్టెంబర్ 2020
Crime - Aug 24, 2020 , 15:28:58

అమెరికా మహిళపై లైంగిక దాడికి ప్రయత్నించిన వ్యక్తి అరెస్ట్

అమెరికా మహిళపై లైంగిక దాడికి ప్రయత్నించిన వ్యక్తి అరెస్ట్

చెన్నై: అమెరికాకు చెందిన ఒక మహిళపై లైంగిక దాడికి ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడులోని తిరువన్నమలైలో ఆదివారం ఈ ఘటన జరిగింది. అమెరికా జాతీయురాలైన ఒక మహిళ ఆధ్యాత్మిక చింతనతో తిరువన్నమలైకి వచ్చి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నది. నమక్కల్‌కు చెందిన ఒక వ్యక్తి సాధువునని చెప్పుకుంటూ ఆలయాల వద్ద తిరుగుతుంటాడు. కాగా, ఆదివారం ఒక గుడికి వచ్చిన అమెరికా మహిళతో మాటలు కలిపి ఆమెను మభ్యపెట్టి లైంగికదాడికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించి దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు చెప్పారు.

పురాతనమైన ప్రసిద్ధ అరుణాచలేశ్వర్ ఆలయం ఉన్న తిరువన్నమలై ఆధ్యాత్మిక ప్రాంతంగా పేరుగాంచింది. దీంతో ఇక్కడ అనేక ఆశ్రమాలు కూడా ఉన్నాయి. భక్తిభావంవైపు మళ్లిన దేశ, విదేశాలకు చెందిన భక్తులు ఇక్కడ నివసించి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో తమ జీవితాన్ని గడుపుతారు.

 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo