బుధవారం 20 జనవరి 2021
Crime - Oct 22, 2020 , 19:45:17

తాయె‌త్తులు, మంత్రాల పేరుతో మోసం.. వ్య‌క్తి అరెస్టు

తాయె‌త్తులు, మంత్రాల పేరుతో మోసం.. వ్య‌క్తి అరెస్టు

రాజ‌న్న‌సిరిసిల్ల : తాయెత్తులు, మంత్రాల నెపంతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. పెద్దూరుకి చెందిన దుర్గ‌య్య అనే వ్య‌క్తి జిల్లెల్లలో ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. మాన‌సిక స‌మ‌స్య‌లు, ఆరోగ్య స‌మ‌స్య‌లు న‌యం చేస్తాన‌ని చెబుతూ తాయత్తులు,మంత్రాల నెపంతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నాడు. వ్య‌క్తిని అరెస్టు చేసిన పోలీసులు అనంత‌రం మాట్లాడుతూ.. మూఢనమ్మకాల పేరుతో    ప్రజలను మోసం చేస్తూ ధనార్జనకు పాల్పడుతున్నాడని తెలిపారు. సంఘ‌ట‌నా స్థ‌లంలో రూ. 10 వేల న‌గ‌దు, ఉంగ‌రాలు, తాయె‌త్తులు మొద‌లైన‌వాటిని స్వాధీనం చేసుకున్న‌ట్లు చెప్పారు. 


logo