ఆదివారం 29 నవంబర్ 2020
Crime - Oct 30, 2020 , 18:05:39

కోడలు, ప్రియుడ్ని ట్రాక్టర్‌తో తొక్కించి హత్య చేయించిన మామ

కోడలు, ప్రియుడ్ని ట్రాక్టర్‌తో తొక్కించి హత్య చేయించిన మామ

జల్నా: కోడలు, ఆమె ప్రియుడ్ని ట్రాక్టర్‌తో తొక్కించి హత్య చేయించిన మామ, చేసిన మరిదిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మహారాష్ట్రలోని జల్నా జిల్లాలోని చాపల్‌గావ్‌లో ఈ ఘటన జరిగింది. మరియా (32) భర్త పదేండ్ల కిందట చనిపోయాడు. వితంతువైన ఆమెకు గ్రామానికి చెందిన వివాహితుడైన 27 ఏండ్ల హర్బక్ భగవత్ మధ్య సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసిన మరియా మామ, మరిది వారిద్దరిని హెచ్చరించారు. దీంతో తనకు ప్రాణ హాని ఉన్నదంటూ భగవత్‌ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు మార్చి 30న మరియా, భగవత్‌ కలిసి గుజరాత్‌కు పారిపోయారు. మరియా మామ ఫిర్యాదుతో పోలీసులు వారిద్దరిని వెతికి ఏప్రిల్‌ 22న గ్రామానికి తీసుకువచ్చారు. నాటి నుంచి వారిద్దరు కలిసి జీవిస్తున్నారు.

మరోవైపు ఈ నెల 28న మరియా, భగవత్‌ కలిసి బైక్‌పై వెళ్తుండగా మరిది వికాస్‌ లాల్జారే ట్రాక్టర్‌తో ఢీకొట్టి వారిద్దరిపై నుంచి పోనించి తొక్కించాడు. తీవ్రంగా గాయపడిన వారిద్దరు చికిత్స పొందుతూ మరణించారు. భగవత్‌ భార్య ఫిర్యాదుతో మరియా మరిది వికాస్‌, మామ బాత్‌వెల్ సంపత్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం వారిద్దరిని అరెస్ట్‌ చేశారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.