శనివారం 16 జనవరి 2021
Crime - Jan 11, 2021 , 19:53:52

గోల్డ్‌ షాప్‌లో దోపిడీ.. దొంగలపై ముగ్గురు దాడి

గోల్డ్‌ షాప్‌లో దోపిడీ.. దొంగలపై ముగ్గురు దాడి

ముంబై: గోల్డ్‌ షాప్‌లోకి ఆయుధాలతో చొరబడి ఆభరణాలను దోచుకున్న దొంగలపై దాడి చేసి పట్టుకునేందుకు ముగ్గురు వ్యక్తులు ప్రయత్నించారు. అయితే దొంగలు వారిని గాయపరిచి తప్పించుకుని పారిపోయారు. మహారాష్ట్రలోని థానే జిల్లాలో సోమవారం ఈ ఘటన జరిగింది. అంబర్‌నాథ్‌ ప్రాంతంలోని సర్వోదయ నగర్‌లో ఒక జ్యూయలరీ షాపులోకి ఆయుధాలు కలిగిన వ్యక్తులు చొరబడ్డారు. నగలను దోచుకున్న తర్వాత అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. 

గమనించిన ముగ్గురు యువకులు దొంగలను నిలువరించేందుకు యత్నించారు. అయితే ఆయుధాలు కలిగిన ఆ వ్యక్తులు ముగ్గురిని గాయపరిచి తప్పించుకుని పారిపోయారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఆభరణాల దోపిడీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

కాగా దొంగలను పట్టుకునేందుకు ముగ్గురు యువకులు ప్రయత్నించిన తీరు సీసీటీవీలో రికార్డు అయ్యింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.