శనివారం 27 ఫిబ్రవరి 2021
Crime - Jan 16, 2021 , 14:41:02

ప్రియురాలిని హత్య చేసి.. గోడలో శవాన్ని దాచి

ప్రియురాలిని హత్య చేసి.. గోడలో శవాన్ని దాచి

ముంబై: ప్రియురాలిని హత్య చేసిన ఓ వ్యక్తి ఆమె శవాన్ని తన ఇంటి గోడలో దాచాడు. మహారాష్ట్రలోని పాలగఢ్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది. వాన్‌గాన్‌ గ్రామానికి చెందిన 30 ఏండ్ల వ్యక్తికి 32 ఏండ్ల మహిళతో పరిచయం ఏర్పడింది. ఐదేండ్లుగా వారిద్దరు కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో తనను పెండ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి చేసింది. దీంతో గత ఏడాది అక్టోబర్‌లో ప్రియురాలిని అతడు హత్య చేశాడు. తన ఫ్లాట్‌ గోడలోపల ఆమె మృతదేహాన్ని ఉంచి సిమెంట్‌ చేశాడు. మహిళ కుటుంబ సభ్యులు అతడ్ని ఆరా తీయగా ఆమె గుజరాత్‌కు వెళ్లినట్లు వారితో చెప్పాడు. దీంతో అనుమానించిన వారు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు జరిపిన పోలీసులు చివరకు ఆ వ్యక్తి ఇంటి గోడలో ఆమె అస్థిపంజరాన్ని గుర్తించారు. నిందితుడ్ని అరెస్ట్‌ చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo