థానే: మహారాష్ట్రలోని థానే జిల్లా కేంద్రంలో స్థానిక పోలీసులు ఓ వ్యభిచార ముఠా గుట్టురట్టు చేశారు. కపూర్బౌడీ ఏరియాలో ఓ మహిళ తన సహచరులతో కలిసి వ్యభిచార గృహం నిర్వహిస్తున్నదన్న సమాచారం మేరకు పోలీసులు శనివారం మధ్యాహ్నం ఆ వ్యభిచార గృహంపై రైడ్ చేశారు. వ్యభిచార గృహం నిర్వహిస్తున్న మహిళను, ఆమె సహచరుడిని అరెస్ట్ చేశారు. ఆ వ్యభిచార గృహంలో విటుల కోసం ఏర్పాటు చేసిన ఐదుగురు మహిళలను రక్షించి ( Women rescued ) పునరావాస కేంద్రానికి తరలించారు. అనంతరం నిందితులపై ఇండియన్ పీనల్ కోడ్‌లోని సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.