గురువారం 21 జనవరి 2021
Crime - Nov 06, 2020 , 14:45:29

సెల్ఫీ తీసుకుంటూ లోయలోపడి మృతిచెందిన మహిళ

సెల్ఫీ తీసుకుంటూ లోయలోపడి మృతిచెందిన మహిళ

ఇండోర్‌: ఒక మహిళ సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు లోయలో పడి మరణించింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ ఘటన జరిగింది. నీతు మహేశ్వరి అనే 30 ఏండ్ల మహిళ గురువారం కుటుంబ సభ్యులతో కలిసి పిక్నిక్‌కు వెళ్లింది. ఇండోర్‌కు 55 కిలోమీటర్ల దూరంలోని జామ్ గేట్ ప్రాంతానికి వారంతా వెళ్లారు. అక్కడ ఒక కొండపై నుంచి మొబైల్‌లో సెల్ఫీ తీసుకునే క్రమంలో నీతు జారి లోయలోకి పడిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో దట్టమైన అటవీ ప్రాంతంలో ఆమె కోసం నాలుగు గంటలపాటు వెదికారు. చివరకు నీతు మృతదేహాన్ని కనుకొన్నారు. పొస్టుమార్టం కోసం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్‌ అధికారి తెలిపారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo