శనివారం 26 సెప్టెంబర్ 2020
Crime - Sep 15, 2020 , 12:27:01

కరోనాతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మృతి

కరోనాతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మృతి

భోపాల్‌ : కరోనా మహమ్మారి సామాన్యులతో పాటు రాజకీయ నాయకులు, ప్రముఖులను వణికిస్తోంది. ఇప్పటికే మహమ్మారిన బారినపడి పలువురు రాజకీయ నాయకులు మృతి చెందగా.. తాజాగా మధ్యప్రదేశ్‌లో మరో ఎమ్మెల్యే వైరస్‌ బారినపడి మృత్యువాతపడ్డారు. బియోరా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గోవర్ధన్‌ డాంగి కరోనాతో మృతి చెందారు. ఇటీవల ఆయన కరోనా పాజిటివ్‌గా పరీక్షించగా, భోపాల్‌లోని ఓ దవాఖానలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో ఢిల్లీ గురుగ్రామ్‌ మేదాంత దవాఖానలో చేర్పించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మంగళవారం ఆయన కన్నుమూశారు. మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ట్విట్టర్‌లో ఆయన మృతికి సంతాపం ప్రకటించింది. బీజేపీ నాయకుడు కైలాష్‌ విజయ్‌ సైతం సంతాపం తెలిపారు. ఇదిలా ఉండగా, ఎమ్మెల్యే గోవర్ధన్‌ డాంగి మృతితో మధ్యప్రదేశ్‌లో ఎమ్మెల్యేల ఖాళీల సంఖ్య 28కి చేరింది. అలాగే కాంగ్రెస్‌ సభ్యుల బలం 88కి పడిపోయింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo