ఆదివారం 17 జనవరి 2021
Crime - Nov 16, 2020 , 21:52:32

దవాఖాన నుంచి శిశువును అపహరించిన మహిళ

దవాఖాన నుంచి శిశువును అపహరించిన మహిళ

భోపాల్‌: దవాఖానలో అప్పుడే పుట్టిన శిశువును ఒక మహిళ అపహరించింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ ఘటన జరిగింది. మహారాజా యశ్వంతరావు దవాఖానలో ఆదివారం ఒక మహిళ శిశువునకు జన్మనిచ్చింది. ఇంతలో ఒక యువతి వారి వద్దకు వచ్చింది. శిశువు గుండె కొట్టుకోవడంలో తేడా ఉన్నదని, పరీక్ష కోసం తీసుకెళ్లాలని చెప్పింది. ఆ శిశివును తన చేతుల్లోకి తీసుకుని ఆ మహిళ వెళ్తుండగా బిడ్డ అమ్మమ్మ ఆమెను అనుసరించింది. అయితే శిశువును డాక్టర్‌కు చూపించి తీసుకువస్తానని చెప్పి ఆ యువతి మాయమైంది. ఆమె ఎంతకి తిరిగిరాకపోడంతో బిడ్డ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దవాఖానలోని సీసీటీవీ దృశ్యాలను పోలీసులు పరిశీలించారు. శిశువును చేతపట్టుకుని వెళ్తున్న యువతిని బిడ్డ అమ్మమ్మ అనుసరించడం, అనంతరం ఆమె మాయం కావడం అందులో కనిపించాయి. దీంతో సీసీటీవీ దృశ్యాలను మరింతగా పరిశీలించి పసి బిడ్డను అపహరించిన నిందితురాలిని పట్టుకుంటామని ఇండోర్‌ ఎస్పీ విజయ్‌ విజయ్ ఖాత్రి తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి