బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Jul 01, 2020 , 13:38:27

ప్రాణం మీదికి తెచ్చిన లూడో గేమ్‌

ప్రాణం మీదికి తెచ్చిన లూడో గేమ్‌

ఖమ్మం : లూడో గేమ్‌ ఇద్దరు స్నేహితుల మధ్య గొడవకు దారి తీసింది. స్నేహితుడు బీర్‌ బాటిల్‌తో దాడి చేయగా తీవ్రంగా గాయపడిన వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలోని బోనకల్‌లో సోమవారం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు..  బోనకల్లుకు చెందిన ఇద్దరు స్నేహితులు నాగేశ్వర్‌రావు, గోపి సోమవారం రాత్రి రూ.50 బెట్టింగ్‌ పెట్టి లూడో గేమ్‌ ఆడగా నాగేశ్వర్‌రావు గెలుపొందడంతో గోపి డబ్బు చెల్లించాడు. మరోసారి రూ.500 బెట్‌ పెట్టి ఆడుదామని నిశ్చయించుకొని ఇద్దరు ఆట ప్రారంభించారు. ఈసారి కూడా నేనే గెలుస్తానని నాగేశ్వర్‌రావు ధీమా వ్యక్తం చేయడంతో కోపోద్రిక్తుడైన గోపి పక్కనే ఉన్న బీర్‌బాటిల్‌తో నాగేశ్వర్‌రావుపై దాడి చేశాడు. వెంటనే రావు కూడా గోపిపై దాడికి దిగాడు. ఇద్దరు పరస్పరం ఘర్షణ పడి కిందపడిపోయారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించి తీవ్రంగా గాయపడిన నాగేశ్వర్‌రావును ఖమ్మం ప్రభుత్వ దవాఖానకు తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నాగేశ్వర్‌రావు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. logo